Wednesday, May 19, 2010

ఆధునిక సంఘజీవనం

అద్దంలాంటి మనసుని

ముక్కలు చేయడానికి

రాళ్ళు రువ్వితే కొందరు

ఫక్కున నవ్వే వాళ్ళు కొందరు

తిక్క కుదిరిందనుకునే వాళ్లు కొందరు

పక్కన చేరి ఓదార్చి

అక్కున చేర్చుకునే వాళ్ళంతా

ఎక్కడ పోతున్నారు?

ఎవడి బాధ వాడిది

ఎవరి దారి వారిది

ఉరుకుల పరుగుల బ్రతుకు

తరగని దూరం వైపు అడుగు

అన్నిటిమీదా విసుగు

ఆధునికత ముసుగు

Sunday, August 9, 2009

నువ్వున్నావ్


(1998)

ప్రకృతి ప్రమద


(1996)

వసంతం


1994

సంక్రాంతి


(1998)

మలిప్రేమ


(2000)

ఎడబాటు


(1999)

కొందరు


(1998)

వలపు

నన్ను చూడగానె నీ కన్నుల్లో మెరుపు
నాతో మాట్లాడగానె చెక్కిలిపై ఎరుపు
తియ్యని నీ నిట్టూర్పు నీ ఒళ్ళు విరుపు
చూస్తేనే తెలుస్తోంది వలపు మైమరుపు

(1989)

నా దేశం

అంబరాన్ని చుంబించే
హిమగిరి శిఖరం...
వేదఘోష వినిపించే
సాగర కెరటం...
ఈ రెంటి మధ్య వారధి
నా ప్రియ భారతి

(1990)